అఫ్రిది, అమిర్‌తో నవీన్‌ మాటల యుద్ధం - Naveen Ul Haq got engaged in a heat exchange of words Shahid Afridi and Mohammad Amir in lankan premier league
close
Published : 01/12/2020 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఫ్రిది, అమిర్‌తో నవీన్‌ మాటల యుద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌: లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గత రాత్రి జరిగిన గాలె గ్లాడియేటర్స్‌, కాండీ టస్కర్స్‌ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్‌ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌.. పాకిస్థాన్‌ ఆటగాళ్లు మహ్మద్‌ అమిర్‌, షాహిద్‌ అఫ్రిదితో గొడపడ్డాడు. మ్యాచ్‌ సందర్భంగా తొలుత క్యాండీ టస్కర్స్‌ 20 ఓవర్లలో 196/5 స్కోర్‌ సాధించింది. బ్రెండన్‌ టేలర్‌(51), కుశాల్‌ మెండిస్‌(49) మెరుపు బ్యాటింగ్‌ చేశారు. ఛేదనలో దనుష్క గుణతిలక(82) రెచ్చిపోగా మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించలేదు. దీంతో అఫ్రిది టీమ్‌ 171/7 స్కోర్‌కే పరిమితమై 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

అయితే గాలె ఇన్నింగ్స్‌ చివర్లో మహ్మద్‌ అమిర్‌(15) బ్యాటింగ్‌ చేస్తుండగా తొలుత నవీన్‌ నోటికి పనిచెప్పాడు. 18వ ఓవర్‌ వేసిన అతడు మూడో బంతికి గుణతిలకను ఔట్‌ చేయగా, అప్పుడే క్రీజులోకి వచ్చిన అమిర్‌ నాలుగో బంతిని బౌండరీకి బాదాడు. దీంతో నవీన్‌ ఏదో అన్నాడు. ఆపై నవీన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేయడానికి మరోసారి బంతి అందుకోవడంతో అమిర్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో మరోసారి అఫ్గాన్‌ పేసర్‌ తన మాటలకు పదునుపెట్టాడు. ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం మొదలవ్వడంతో ఇతరులు కలుగజేసుకొని వారిని అడ్డుకున్నారు. ఇక మ్యాచ్‌ పూర్తయ్యాక అమిర్‌ సైతం ఏదో అన్నాడు. చివరికి గాలే జట్టు ఓడిపోయాక ఆటగాళ్లతో కలిసి అఫ్రిది  మైదానంలోకి వస్తూ నవ్వుకుంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అదే సమయంలో నవీన్‌ కనపడడంతో నవ్వు ఆపేసి ఏమైందని అడిగాడు. దాంతో అఫ్గాన్‌ పేసర్‌ మరోసారి మాటల యుద్ధానికి దిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం పక్కనపెడితే లంక ప్రీమియర్‌ లీగ్‌లో అఫ్రిది నాయకత్వం వహిస్తున్న గాలే టీమ్‌ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడగా ఒక్కటి కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని