మారని పాక్‌: ఉగ్రవాదులకు వీఐపీ మర్యాదలు - Pak treats 21 dreaded terrorists as VIPs
close
Updated : 21/09/2020 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారని పాక్‌: ఉగ్రవాదులకు వీఐపీ మర్యాదలు

ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌లోకి పాకిస్తాన్..?

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్టు నటిస్తూ, వారికి వెన్నుదన్నుగా నిలిచే పాక్‌ ద్వంద్వ వైఖరి పట్ల అంతర్జాతీయ సమాజం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ పరిశీలనా సంస్థ ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌’ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తనపై కొరడా ఝళిపిస్తున్నప్పటికీ.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి వీఐపీ మర్యాదలు అందించటం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

నేరగాళ్లు, ఉగ్రవాదులకు భద్రతా?

21 మంది కరడు గట్టిన నేరగాళ్లు, ఉగ్రవాదులకు పాక్‌ ప్రభుత్వం వీఐపీ భద్రతను కేటాయించినట్టు తెలుస్తోంది. వీరిలో చీకటి సామ్రాజ్యపు నేత దావూద్‌ ఇబ్రహీం, ఇండియన్‌ ముజాహిదీన్‌ అధ్యక్షుడు రియాజ్ భత్కల్‌, ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్‌ జిందాబాద్‌ ఫోర్స్‌కు చెందిన రంజీత్‌ సింగ్‌ నీతాలతో పలువురు భయంకర ఉగ్రవాదులు  ఉండటం.. వారిలో పలువురు భారత్‌ వెతుకుతున్న ‘మోస్ట్‌ వాంటెడ్‌’ ఉగ్రవాదులు కావటం గమనార్హం.

ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌లోకి..

ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తుంది. కాగా ఇప్పటి వరకు ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి.  గ్రే లిస్ట్‌ నుంచి ఈ జాబితాలోకి దిగజారకుండా ఉండేందుకు పాక్‌ శత విధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ కళ్లు కప్పేందుకు ఉగ్రవాద కట్టడికి చర్యలు తీసుకున్నట్టుగా పాక్‌ ప్రభుత్వం నటిస్తోంది. ఇందుకు గాను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ భద్రతా మండలి విడుదల చేసిన జాబితాలో ఉన్న 88 నేతలు, ఉగ్రవాదులపై చర్యలను ముమ్మరం చేసింది. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తులు స్వాధీనం చేసుకోవటంతో పాటు వారు విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది.

ప్రదర్శనే పాక్‌ నైజం

అయితే పాక్‌ ప్రకటనలే తప్ప నిజంగా ఈ చర్యలు ఎంతమేరకు అమలౌతున్న వివరాలు తెలియరాలేదు. ఇప్పటి వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న పాక్‌కు.. జూన్‌ 2020లోగా మిగిలిన కార్యాచరణను పూర్తి చేయాల్సిందిగా ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరించింది. కరోనా కారణంగా ఈ వ్యవధిని సెప్టెంబర్‌ వరకు పొడిగించింది. కాగా, భారత్‌ వ్యతిరేక శిక్షణ, ఆయుధాల సరఫరాలతో సహా ఉగ్రవాద ముఠాలకు ‘అన్నివిధాలా’ ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ వైఖరి పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తన ప్రయత్నాలను ‘ప్రదర్శించినప్పటికీ’.. బ్లాక్‌లిస్ట్‌లోకి చేరడాన్ని తప్పించుకునేందుకు పాక్‌ ఈ నాటకాలు ఆడుతోంది తప్ప, ఈ దేశం అసలు రంగు మారలేదని నిపుణులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు వీఐపీ భద్రత కల్పించటం, పాక్‌ ఉగ్రవాదుల ఉనికిని నిరూపించేందుకు ఆప్ఘనిస్తాన్‌ పలు ఆధారాలు చూపటం వంటివి ఇందుకు నిదర్శనమని పరిశీలకులు వెల్లడించారు. ఈ విధానాన్నే కొనసాగిస్తే పాకిస్తాన్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి చేరటం ఖాయమని వారు అంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని