’చూస్తూ కూర్చోవద్దు.. కేంద్రం ఏదైనా చేయాలి’ - Pollution an issue not only for Delhi but entire north India says Manish sisodia
close
Published : 13/10/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

’చూస్తూ కూర్చోవద్దు.. కేంద్రం ఏదైనా చేయాలి’

కాలుష్య సమస్యపై సిసోడియా విజ్ఞప్తి

దిల్లీ: పంట వ్యర్థాల దహనంతో ఏర్పడుతున్న కాలుష్యం ఒక్క దిల్లీ నగరానికే కాదు.. యావత్‌ ఉత్తర భారతదేశానికే పెద్ద సమస్యగా మారిందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఎప్పటినుంచో పనిచేస్తోందని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారంలో కేంద్రం తీరు దురదృష్టకరమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ఏమీ చేయడంలేదని, ఏడాదిగా కూర్చుని చూస్తోందని ఆరోపించారు. ఈ సమస్యతో మొత్తం ఈశాన్య భారతం బాధపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించడంలో తనదైన పాత్ర పోషించాలని, అలాగే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు బాధ్యతతో పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. కాలుష్యంతో కూడిన ఓవైపు కాలుష్యం.. మరోవైపు కరోనా వైరస్‌ ప్రజలకు ప్రాణాంతకంగా మారాయని సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని