భాగ్యనగరంలో బుట్టబొమ్మ సందడి..! - Pooja Hegde Headed to Hyderabad To Resume Shoot
close
Published : 14/09/2020 13:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాగ్యనగరంలో బుట్టబొమ్మ సందడి..!

ప్రభాస్‌తో వర్క్‌.. హైదరాబాద్‌కి వచ్చిన పూజా

హైదరాబాద్‌: బుట్టబొమ్మ పూజాహెగ్డే భాగ్యనగరంలో సందడి చేశారు. చాలాకాలం తర్వాత హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మొదటిసారి తళుక్కున మెరిశారు. ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఆమెను చూసిన అభిమానులు తమ కెమెరాల్లో ఫొటోలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ దొరకడంతో పూజా ముంబయి చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. చెఫ్‌గా మారి ఎన్నో ప్రత్యేకమైన వంటకాలు తయారుచేసి ఇంటిల్లిపాదికి రుచి చూపించారు. షూటింగ్‌లు చేసుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పూజా తన తదుపరి సినిమా పనుల నిమిత్తం హైదరాబాద్‌కి చేరుకున్నారు.

కాగా, ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్‌’ సినిమా చిత్రీకరణ కోసమే పూజా హైదరాబాద్‌కి వచ్చారంటూ ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో వచ్చేవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని, దీంతో త్వరలోనే ప్రభాస్‌-పూజా కలిసి సెట్‌లో అడుగుపెట్టనున్నారంటూ సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అలనాటి తార భాగ్యశ్రీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్‌కి ముందు జార్జియాలో జరిగిన షూటింగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జార్జియా షెడ్యూల్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డే, భాగ్యశ్రీ, ప్రియదర్శి పాల్గొన్నారు. మరోవైపు పూజా అఖిల్‌తో కలిసి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో సందడి చేయనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని