close
Published : 22/10/2020 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘RRR‌’: కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ వచ్చేశాడు!

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తమ అభిమాన కథానాయకుడు ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కోసం ఆశగా చూస్తున్న వారికి చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చింది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పాత్రను రామ్‌చరణ్‌ ప్రేక్షకులకు పరిచయం చేశారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియాభట్‌, ఓలివియా మోరిస్‌ కథానాయికలు.

‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి. కొమురం భీమ్‌’’ అంటూ తారక్‌ పాత్రను రామ్‌చరణ్‌ పరిచయం చేశారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ లుక్‌ అభిమానులను కట్టిపడేసింది. ఇక తెరపై ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూడటమే ఆలస్యం.

కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభం కాగా, షూటింగ్‌ మొదలైన వెంటనే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, ప్రత్యేక వీడియోను విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. గురువారం తాజా వీడియోను రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తొలుత చెప్పినా, అభిమానులను కాస్త ఊరించి 11.30గం.లకు విడుదల చేశారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని