కాబోయేవాడి గురించి బయటపెట్టిన రకుల్‌ - Rakul Preet Singh opens up on love marriage and to be partner
close
Updated : 11/12/2020 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాబోయేవాడి గురించి బయటపెట్టిన రకుల్‌

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంటా..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఆమె ఓ ప్రముఖ బ్రైడల్‌ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. పెళ్లి కుమార్తెలా అలకరించుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను సైతం ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా, ఈ మ్యాగజైన్‌ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో వివరించారు.

‘ప్రేమ, పెళ్లిపై నాకెంతో నమ్మకం ఉంది. నాకు కాబోయే వరుడికి జీవితంపట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలి. సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చిన నేను.. నాన్న ఉద్యోగం కారణంగా ఆర్మీకి సంబంధించిన వాతావరణంలో పెరిగాను. కాబట్టి నాకు కాబోయే భర్త.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే ఎంతో సంతోషిస్తా. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నా వివాహం జరగాలని ఆశిస్తున్నా. బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనే ఆలోచన ఉంది’ అని రకుల్‌ వెల్లడించారు.

ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లో మెప్పించిన రకుల్‌ మొదటిసారి డీగ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా సందడి చేయనున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ శివారులో జరిగింది. దీనితోపాటు బాలీవుడ్‌లో అర్జున్‌ కపూర్‌ సరసన ఆమె ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. అర్జున్‌ కొవిడ్‌-19 బారినపడడంతో షూటింగ్‌ను మరికొన్నిరోజులు వాయిదా వేశారు.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫొటోగ్యాలరీ

ఇవీ చదవండి
నిహారిక-చైతన్య: కొత్త జంట కొత్త ఫొటోలు

ఆ పాత్రలో నటించడం లేదు: అనసూయమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని