
తాజా వార్తలు
కోర్టు మెట్లు ఎక్కిద్దామంటే.. చెల్లి వద్దంది!
ముంబయి: సందర్భమేదైనా సరే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించి వివాదాలకు తెర తీస్తుంటారు బాలీవుడ్ నటి కంగన రనౌత్ సోదరి రంగోలీ. కంగన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిపై మాటల తుటాలు పేలుస్తుంటారామె. ముంబయిలోని కంగన ఆఫీస్ కూల్చేందుకు అక్కడి మున్సిపల్ అధికారులు ఇటీవల యత్నించిన విషయం తెలిసిందే. దీంతో కంగన కోర్టును ఆశ్రయించడం... విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సదరు నటికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ‘బీఎంసీది కక్ష్య సాధింపు చర్య’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో.. కంగన కార్యాలయాన్ని కూల్చివేయాలని కోరుకున్న నటీమణులు తాప్సీ, స్వరా భాస్కర్‌పై మరోసారి రంగోలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంలో తాను ఉన్నట్లు తెలిపారు. ‘‘కుటుంబం పరంగా మేము క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు స్వరా భాస్కర్, తాప్సీ లాంటి బీ గ్రేడ్ నటీమణులు.. కంగన కార్యాలయం కూల్చివేత గురించి హేళనగా మాట్లాడారు. కార్యాలయాన్ని కూల్చడం న్యాయమేనన్నట్లు వాళ్లు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లని కోర్టు మెట్లు ఎక్కించాలని ఆశించాను. కానీ, కంగనకు అది ఇష్టం లేదు. అసూయ, అహంకారాలతో రగిలిపోతున్న ఆ బీ గ్రేడ్ నటీమణులు కంగన గురించి చేస్తున్న వ్యాఖ్యలు నమ్మకండి’’ అని రంగోలీ పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
