ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, బీఓబీలకు సెబీ రూ.10 లక్షల జరిమానా - SEBI fines SBI LIC and BOB Rs 10 lakh
close
Published : 15/08/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, బీఓబీలకు సెబీ రూ.10 లక్షల జరిమానా

దిల్లీ: మ్యూచువల్‌ఫండ్‌ నిబంధనలను పాటించనందుకు గాను ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలకు రూ.10 లక్షల చొప్పున సెబీ జరిమానా విధించింది. ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌కు ఎల్‌ఐసీ, బరోడా మ్యూచువల్‌ ఫండ్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు ప్రాయోజిత సంస్థలుగా ఉన్నాయి. అయితే ఈ మూడు సంస్థల్లో అవి 10 శాతానికి మించి వాటాలను కలిగి ఉన్నాయని సెబీ గుర్తించింది. యూటీఐ ఏఎంసీకి ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, బీఓబీలు ప్రాయోజిత సంస్థలుగా ఉండటమే కాకుండా అందులోనూ 10 శాతానికి మించి వాటాను ఇవి కలిగి ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ నిబంధనలకు ఇది విరుద్ధమని, ఒక్కో సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని