అబ్దుల్‌ కలాం, ఐన్‌స్టీన్‌ తర్వాత ఈ బాబేనట..! - Serious Men film Official Trailer Released
close
Published : 18/09/2020 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అబ్దుల్‌ కలాం, ఐన్‌స్టీన్‌ తర్వాత ఈ బాబేనట..!

ఆసక్తికరంగా ‘సీరియస్‌ మెన్‌’ ట్రైలర్‌

ముంబయి: కుమారుడి భవిష్యత్తు కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధపడే తండ్రి అతడు. అనుకున్నట్లే తన బాబును గొప్పగా పెంచే ప్రయత్నం చేస్తాడు.. దానికి ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథాంశంతో తెరకెక్కించిన సినిమా ‘సీరియస్‌ మెన్‌’. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తండ్రి పాత్రను పోషించారు. బాల నటుడు అక్షంత్‌ దాస్‌ ఆయన కుమారుడిగా నటించారు. సుధీర్‌ మిశ్రా దర్శకుడు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2న విడుదల కాబోతోంది. ‘సీరియస్‌ మెన్‌’ అనే పుస్తకం ఆధారంగా దీన్ని రూపొందించారు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘మా నాన్న (ముందు తరం) పాఠశాలకు వెళ్లలేదు.. నేను రెండో తరం.. పాఠశాలకు వెళ్లా, చదివా...’ అంటున్న నవాజ్‌ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. జీవితంలో పేరు తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. కానీ కుదరదు.. అందుకే తనకు పుట్టిన బాబును గొప్ప వాడిని చేయాలి అనుకుంటారు. ‘ఇది నీ చోటు.. ఇక్కడే చదవాలి. ఇక్కడంతా చీకటిగా ఉంది. కానీ నీ టాలెంట్‌తో వెలుగు తీసుకురావాలి..’ అని బాబుకు చిన్నప్పటి నుంచే ఇంటి పరిస్థితులు చెబుతుంటారాయన. పాఠశాలలో చేరిన బాబు తెలివితేటలు చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతారు. ప్రజలు అతడ్ని జూనియర్‌ అబ్దుల్‌కలాం, ఐన్‌స్టీన్‌తో పోల్చుతుంటారు. చివర్లో ఓ ట్విస్ట్‌తో ట్రైలర్‌ను ముగించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని