ఎయిమ్స్‌లో చేరకపోవడం ఆశ్చర్యం కలిగించింది - Shashi Tharoor Targets Amit Shah Choosing Private Hospital for Covid treatement
close
Published : 04/08/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిమ్స్‌లో చేరకపోవడం ఆశ్చర్యం కలిగించింది

దిల్లీ: ప్రభుత్వ సంస్థలు ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రముఖులు వాటిని సందర్శించి మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కరోనా వైరస్‌ సోకిన అనంతరం హోం మంత్రి అమిత్‌ షా ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందడాన్ని థరూర్ తప్పుబట్టారు. ‘‘హోం మంత్రి అనారోగ్యానికి గురైనప్పుడు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వెళ్లకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన ప్రభుత్వ ఆస్పత్రికి కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు. ప్రభుత్వ సంస్థలు ప్రజల విశ్వా'సాన్ని పొందాలంటే ప్రముఖులు వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించాలి’’ అని అమిత్ షాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి ఎయిమ్స్‌ నమూనాను అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ పరిశీలిస్తున్న ఫొటోను జత కలిపారు.

ఆదివారం తనకు కరోనా సోకినట్లు హోం మంత్రి అమిత్ షా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరుతున్నట్లు, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ట్వీట్ చేశారు. నిన్న ఒక్క రోజే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్ పురోహిత్‌ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌తో సహా యడియూరప్ప, గవర్నర్‌ బన్వరిలాల్ పురోహిత్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం గమనార్హం. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 18లక్షలకు చేరింది. 11లక్షల 86వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2కోట్ల 2లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) తెలిపింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని