ఎన్డీయేలో కొందరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు - Some trying to make a dent in NDA: Nadda s indirect attack on Chirag
close
Published : 26/10/2020 23:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్డీయేలో కొందరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు

చిరాగ్‌పై నడ్డా పరోక్ష విమర్శలు

ఔరంగాబాద్‌ (బిహార్‌): బిహార్‌లోని ఎన్డీయే కూటమిలో కొందరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన విమర్శల్లో ఎక్కడా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ చిరాగ్‌ పాస్వాన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్‌లో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఓ వైపు సీఎంను తిడుతూనే.. మరోవైపు ప్రధాని మోదీని పొగుడుతున్నారని నడ్డా అన్నారు. ఎన్డీయేలో భాజపా, జేడీయూ, వీఐపీ, హెచ్‌ఏఎం మాత్రమే ఉన్నాయని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో ఒకప్పుడు అరాచకపాలనకు కారణమైన వారు.. ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారంటూ ఆర్జేడీనుద్దేశించి నడ్డా విమర్శించారు. అలాంటి వారు బిహార్‌ను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రెండు ఇంజిన్ల ప్రభుత్వంతోనే (కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే) బిహార్‌లో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే సీపీఐ (ఎంల్‌) లాంటి పార్టీకి ఆర్జేడీ సీట్లిచ్చిందంటూ విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 లక్షల మంది బిహార్‌ వాసులు విద్యుత్‌ను పొందగలగారని చెప్పారు. రాజకీయాల్లో 15 ఏళ్ల క్రితం కులం, మతం, ప్రాంతం అంటూ మాట్లాడేవారని.. ఇప్పుడు తమ అభ్యర్థులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని నడ్డా అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని