సూర్యవంశీ, 83 చిత్రాలు థియేటర్‌లో... - Sooryavanshi83 Movies Release Next Year
close
Published : 20/11/2020 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్యవంశీ, 83 చిత్రాలు థియేటర్‌లో...

న్యూ దిల్లీ: అభిమాన హీరోల చిత్రాలు థియేటర్‌లలో చూస్తే వచ్చే కిక్కే వేరు! బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ నటించిన సూర్యవంశీ, రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘83’చిత్రాలు వచ్చే సంవత్సరం థియేటర్‌లలో విడుదలవుతాయని  బాలీవుడ్‌ వాణిజ్య విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.  ‘ప్రతి ఒక్కరి చూపు వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికంపైనే ఉంది.  సూర్యవంశీ, 83 చిత్రాలు 2021 మార్చి 31కి ముందే థియేటర్‌లలో విడుదలవుతాయి. ప్రస్తుతం విడుదల తేదీలు ఖరారు కాలేదు’అని ఆయన ట్వీట్‌ చేశారు.  రోహిత్‌ శెట్టీ దర్శకత్వం వహించిన సూర్యవంశీలో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రం పోషించారు. ఆయనకు జోడీగా కత్రినా కైఫ్ నటించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలు పోషించనున్నారు. కపిల్‌ దేవ్‌ సారథ్యంలో 1983లో భారత్‌ ప్రపంచ క్రికెట్‌ కప్‌ గెలుపు ఆధారంగా ‘83’చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకొణె కపిల్‌ భార్య రోమీ భాటియా పాత్రలో అలరించనుంది.  ఈ రెండు చిత్రాల విడుదలను లాక్‌డౌన్‌ వల్ల వాయిదా వేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని