కొణిదెల-అక్కినేని కోడళ్లు కలిసి వంటచేస్తే..! - Spice up UR life with Samantha posted upasana
close
Published : 27/09/2020 18:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొణిదెల-అక్కినేని కోడళ్లు కలిసి వంటచేస్తే..!

సమంతకి ఉత్తమ కోడలు అవార్డు: ఉపాసన

నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో

హైదరాబాద్‌: అక్కినేని కోడలు, కొణిదెల కోడలు కలిసి రుచికరమైన వంట చేశారు. ఈ క్రమంలో ఉత్తమ కోడలు అవార్డు సమంతకేనని ఉపాసన జోక్‌ చేశారు. వీళ్లిద్దరు కలిసి ‘యువర్ లైఫ్’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌కు సమంత అతిథి సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా సామ్‌ ఇటీవల ఫిట్‌నెస్‌పై అభిప్రాయాల్ని పంచుకున్నారు. శరీరాకృతి కోసం కాకుండా సంతోషం, ఆరోగ్యం కోసం వ్యాయామం చేయమని సూచించారు.

కాగా ఇప్పుడు సామ్‌, ఉపాసన కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చారు. అందులో వీరిద్దరు ఓ ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేశారు. బ్రౌన్ రైస్‌తో తక్కాలి సదం (టమోటా రైస్‌) పేరుతో సమంత క్షణాల్లో రుచికరమైన వంట తయారు చేశారు. అది చూసిన ఉపాసన.. నాగచైతన్య అదృష్టవంతుడని చెప్పారు. అంతేకాదు సమంతను ఉత్తమ కోడలుగా ప్రకటించారు. సామ్‌ వెంటనే.. కాదు, ఉపాసన, ఉపాసన అంటున్న సరదా వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘మీ జీవితాన్ని రుచికరంగా మార్చుకోండి.. సమంత.. న్యూ హెల్తీ మాస్టర్‌ చెఫ్‌’ అని ఈ సందర్భంగా ఉపాసన పోస్ట్‌ చేశారు. ప్రకృతి అనుకూలమైన జీవనాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు సమంత, ఉపాసన కలిసి ‘యువర్ లైఫ్’ డాట్ కో డాట్ ఇన్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని