నాగార్జున బర్త్‌డే: చై మూవీ నుంచి గిఫ్ట్‌ - Team Love Story wishes King nagarjuna a Very Happy Birthday
close
Published : 30/08/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగార్జున బర్త్‌డే: చై మూవీ నుంచి గిఫ్ట్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ‘లవ్‌స్టోరీ’ టీమ్‌ అందమైన గిఫ్ట్‌ ఇచ్చింది. నాగచైతన్య, సాయిపల్లవి కీలక పాత్రల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. శనివారం నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఇందులో చై-సాయిపల్లవి కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు.

ఇంకా 15 రోజుల షూటింగ్ మినహా సినిమా అంతా పూర్తయిందని చిత్ర బృందం తెలిపింది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే షూటింగ్‌ మొదలు పెట్టి, సరైన సమయంలో థియేటర్‌లలో విడుదల చేస్తామని పేర్కొంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌ సీహెచ్‌ సంగీతం అందిస్తున్నారు. ఎమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకంపై నారాయణ దాస్‌ కె నారంగ్‌, పి.రామ్మోహనరావు నిర్మిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని