రామోజీ ఫిల్మ్‌సిటీలో బంగార్రాజు షురూ - Telugu News Bangarraju Shooting Starts At Ramoji Film City
close
Updated : 26/08/2021 08:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామోజీ ఫిల్మ్‌సిటీలో బంగార్రాజు షురూ

ఈసారి సోగ్గాడు ఒక్కడు కాదు... ఇద్దరూ!   అందుకు తగ్గట్టే తెరపై సందడి రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు కల్యాణ్‌కృష్ణ కురసాల. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. విజయవంతమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా రూపొందుతోంది. నాగార్జున, నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్నారు. నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. బుధవారం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ మొదలైంది. భావోద్వేగాలు, వాణిజ్యాంశాల మేళవింపుగా..అంచనాలకి తగ్గట్టుగానే రూపొందుతున్న సినిమా ఇదని చిత్ర వర్గాలు తెలిపాయి. చలపతిరావు, రావు రమేష్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, కళ: బ్రహ్మ కడలి,  ఛాయాగ్రహణం: యువరాజ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని