వాస్తవ ఘటనలతో ‘కళాకార్‌’ - Telugu News Kalakar Teaser Out now
close
Updated : 20/09/2021 08:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాస్తవ ఘటనలతో ‘కళాకార్‌’

థానాయకుడు రోహిత్‌ చాలా విరామం తర్వాత చేస్తున్న చిత్రం ‘కళాకార్‌’. శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. తొలిసారి రోహిత్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ టీజర్‌ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టీజర్‌ చూసి చాలా బాగుందని చెప్పార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రంతో కథానాయకుడిగా తన కెరీర్‌ని పునః ప్రారంభిస్తున్న రోహిత్‌ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు’’ అన్నారు. ‘‘సినిమా పూర్తయింది. దసరాకి విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని