ఆ రహస్యం ఏమిటి? - Telugu News Maestro Trailer Out Now
close
Updated : 24/08/2021 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రహస్యం ఏమిటి?

ప్రతి కళాకారుడిలోనూ ఓ రహస్యం ఉంటుందట. అంధుడైన ఓ పియానో వాయిద్యకారుడి జీవితంలోనూ ఓ రహస్యం దాగుంది. అదేమిటో తెలియాలంటే మాత్రం ‘మాస్ట్రో’ చూడాల్సిందే. నితిన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నభా నటేష్‌ నాయిక. తమన్నా ముఖ్యభూమిక పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. త్వరలోనే   ఈ సినిమాని ఓటీటీ మాధ్యమం డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. థ్రిల్లింగ్‌ అంశాలతో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నభా నటేష్‌.. నితిన్‌ ప్రేయసిగా, ఆయన జీవితాన్ని మార్చే మహిళగా తమన్నా కనిపిస్తారని ట్రైలర్‌ని బట్టి స్పష్టమవుతోంది. నరేష్‌, జిషూసేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్‌, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం:  జె.యువరాజ్‌, సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ళ, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: సాహి సురేష్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని