ఊటీలో ‘గాడ్‌ఫాదర్‌’ - Telugu News The Shooting Of God Father Chiranjeevi Starrer Kick Starts
close
Updated : 23/09/2021 07:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊటీలో ‘గాడ్‌ఫాదర్‌’

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు గోవాలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకుంది. దీనిలో భాగంగా చిరంజీవితో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దాదాపు రెండు వారాల పాటు షూట్‌ అక్కడే కొనసాగనున్నట్లు సమాచారం. ‘‘చిరు నటిస్తున్న 153వ చిత్రమిది. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌’కు రీమేక్‌ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఆ కథలో మార్పులు చేసి మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌లో చిరంజీవిపై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి తమన్‌ స్వరాలుసమకూరుస్తున్నారు. నీరవ్‌ షా ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని