టీకా రాజకీయాలు: భాజపా ప్రకటనపై విమర్శలు - The BJPs free vaccination promise in Bihar become controversial
close
Updated : 22/10/2020 18:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా రాజకీయాలు: భాజపా ప్రకటనపై విమర్శలు

గగ్గోలు పెడుతున్న విపక్షాలు..నెటిజన్ల కామెంట్లు

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో..తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామంటూ భాజపా హామీ ఇవ్వడంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఓటు వేస్తేనే, టీకా ఇస్తారా అంటూ విమర్శలు చేస్తున్నాయి. 

* భాజపా ఇప్పుడే కొవిడ్‌ టీకాను తన అజెండాలో చేర్చి ప్రకటన చేసింది..కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ 
* భాజపా పాలనలో లేని రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి  ఓటు వేయని వారికి టీకా అందదా?..ఆమ్ ఆద్మీ పార్టీ 
*భాజపా ఏమైనా తన పార్టీ కోశాగారం నుంచి టీకాల కోసం చెల్లిస్తుందా? ప్రభుత్వ కోశాగారం నుంచి నిధులు వస్తే, బిహార్‌ ప్రజలకు  ఉచితంగా ఇచ్చినప్పుడు, మిగిలిన వారు ఎందుకు చెల్లించాలి? కొవిడ్ భయాలను సొమ్ము చేసుకోవాలనే ఈ తీరు చాలా తప్పుగా ఉంది..జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 
మీరు ఓట్లు వేస్తే..మేం టీకా వేస్తాం. ఇదేం తీరు?..కాంగ్రెస్ నేత శశిథరూర్

కాగా, శశిథరూర్ ట్వీట్‌పై బిహార్ భాజపా నేత భూపిందర్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను మీ దృష్టికి తీసుకున్న విధానం నిరాశకు గురిచేసింది. అన్ని పార్టీలు మేనిఫెస్టోను విడుదల చేశాయి. నామమాత్రపు ధరకు దేశ ప్రజలకు టీకా అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు వాటిని ఉచితంగా అందించగలవు. మేం చేయగలం’ అంటూ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే కూడా ఈ తరహా వివరణే ఇచ్చారు. కానీ, ఈ వివరణ నెటిజన్లను మెప్పించలేకపోయింది. దాంతో వారు ‘వ్యాక్సిన్ఎలక్షనిజమ్’ అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని