రామరాజు.. భీమ్‌లను దించేశారుగా..! - The MADNESS doesnt end and you guys are killing it
close
Published : 27/10/2020 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామరాజు.. భీమ్‌లను దించేశారుగా..!

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. గతంలో చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా రామరాజు పాత్రను, ఇటీవల కొమురం భీమ్‌ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు ఈ టీజర్‌లను మరిపించేలా స్పూఫ్‌ వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా అలరిస్తున్నారు. అలా రామరాజు, భీం పాత్రలకు సంబంధించిన టీజర్‌లను చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అభిమానులతో పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోలను చూసేయండి

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని