‘నర్తనశాల’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది - The first look poster of Narthanasala released
close
Updated : 20/10/2020 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నర్తనశాల’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

హైదబాద్‌: నందమూరి కథానాయకుడు బాలకృష్ణ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘నర్తనశాల’లో ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రలో శరత్‌బాబు కనిపించనున్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన చిత్రాల్లో ‘నర్తనశాల’ అంటే బాలయ్యకు చాలా ఇష్టం. అందుకే దాన్ని రీమేక్‌ చేయాలని సంకల్పించారు. కానీ కొన్ని కారణాల వల్ల చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.

ఎన్నో ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఆ సన్నివేశాన్ని ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు బాలయ్య విడుదల చేయబోతున్నారు. 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. దీంతో మరో పౌరాణిక పాత్రలో బాలయ్యను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌తో ప్రేక్షకుల్ని అలరించిన బాలయ్య ఆ తర్వాత ‘రూలర్’లో కనిపించారు. ప్రస్తుతం ఆయన 106వ చిత్రం పనులు జరుగుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని సైతం విడుదల చేశారు. నయనతార, శ్రియ ఇందులో కథానాయికలుగా నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని