తొలి చూపులోనే మది దోచారు! - Tollywood heroines unforgettable first movie
close
Updated : 12/10/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి చూపులోనే మది దోచారు!

కొందరు నాయికలు పాత్రకు గుర్తింపు తెస్తారు. దానికి కొంత అనుభవం కావాలి. కొన్ని పాత్రలు నాయికలకే పేరు తెచ్చిపెడతాయి. దీనికి సందర్భం కుదరాలి. కొన్ని కథలకు నూతన నటే న్యాయం చేయగలదని ఆయా చిత్ర దర్శకనిర్మాతలు భావిస్తారు. అలా సీనియర్‌ నాయికలు  కొన్ని సార్లు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలకు దూరం అవుతారు. ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అన్నట్లు  కొత్తగా పరిచయం అయ్యే భామలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్లు ఎన్ని చిత్రాల్లో నటించినా తొలిపాత్ర మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది. ఎందుకంటే ఆ పాత్ర.. ఆ పేర్ల ప్రభావం  అలాంటిది!  తొలి చూపులోనే ప్రేక్షకుల మది దోచుకున్న కొందరు ముద్దుగుమ్మల్ని చూద్దాం..!

సమంత

మంతను పరిచయం చేసిన చిత్రం ‘ఏమాయ చేశావె’. నాగచైతన్య కథానాయకుడుగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తెరకెక్కించారు. ఈ ప్రేమకథలో  ‘జెస్సీ’ అనే పాత్ర పోషించింది సామ్‌. తొలి చిత్రమే అయినా సామ్‌ నటనకు యువత ఫిదా అయిపోయింది. అందుకే సామ్‌ ఎన్ని విభిన్న పాత్రలు చేసినా ‘జెస్సీ’ ప్రత్యేకం.

షాలిని పాండే

షాలిని పాండే అంటే ప్రీతి. ప్రీతి అంటే షాలిని పాండే అనేంతగా మారిపోయింది.  ‘అర్జున్‌ రెడ్డి’తో పరిచయమై యువత గుండెల్లో గూడు కట్టుకుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించారు. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకొంది. తాను ఎన్ని సినిమాల్లో నటించినా ప్రేక్షకులు మాత్రం ‘ప్రీతి’నే అమితంగా ఇష్టపడతారు.

సాయి పల్లవి

‘భానుమతి’ ఒక్కటే పీస్‌ అంటూ ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాలా! వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది సాయి పల్లవి. తొలి చిత్రంతోనే అదరగొట్టేసింది. తెలంగాణ యాసతో ఓ ఊపు ఊపింది. హైపర్‌ యాక్టివ్‌గా కనిపించి ఏ పిల్లరా మైండ్‌ నుంచి పోవట్లేదు అపిపించుకుంది.

రాశీఖన్నా

‘శ్రీ సాయి శిరీష ప్రభావతి’ ఉంటే శిరీష అయినా ఉండాలి లేకపోతే ప్రభావతి అయినా ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఎంటి? అంటూ ప్రశ్నిస్తూనే వినోదం పంచింది రాశీఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలోని రాశీ పాత్ర పేరిది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించింది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ అగ్రనాయికల సరసన అవకాశాలు అందుకుంటుంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

‘ప్రార్థన’ ఇక్కడ.. ప్రతిదీ కౌంట్‌ అంటూ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ పాత్ర ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. సందీప్‌ కిషన్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రమిది. తొలిపాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వరస అవకాశాలు అందుకుంటుంది. అయితే అంతకుముందే కెరటంలో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఇందు’ ఈ పేరు, పాత్ర ప్రతి యువకుణ్ని కదిలించింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలో పాయల్‌ పోషించిన పాత్ర పేరే ఇందు. ఈ సినిమాలో ఓ అబ్బాయిని మోసం చేసిన అమ్మాయిగా కనిపిస్తుంది పాయల్‌. తన నటన, అందచందాలతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని మాయలో పడేసింది. తొలి ప్రయత్నంలోనే బోల్డ్‌ సన్నివేశాల్లో నటించి ఓ సంచలనమే సృష్టించింది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని