కరోనా టీకా వేయించుకున్న యూఏఈ ప్రధాని - UAE PM sheikh mohammed bin receives COVID 19 vaccine shot
close
Published : 03/11/2020 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా వేయించుకున్న యూఏఈ ప్రధాని

అబుదాబి: యూఏఈ ప్రధాని  షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషిద్‌ అల్‌ మాక్తొమ్‌ మంగళవారం కరోనా టీకా వేయించుకున్నారు. వాక్సిన్‌ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈరోజు కొవిడ్‌ టీకా వేయించుకున్నాను. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా. యూఏఈలో వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు రాత్రింబవళ్లు శ్రమించిన వైద్య బృందం పట్ల గర్వంగా ఉంది. ఇకపై యూఏఈలో మంచిరోజులు రాబోతున్నాయి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

గత కొద్దివారాల్లో యూఏఈలోని పలువురు మంత్రులు కొవిడ్‌ టీకాను వేయించుకున్నారు. కరోనా రోగులతో కాంటాక్ట్‌ అయిన ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసర సమయంలో కరోనా టీకా ఇచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. టీకా లైసెన్స్‌ కోసం అవసరమైన చర్యలు చేపడుతోంది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని