భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందంటే?  - Union Minister Harshvardhan on Corona vaccine
close
Updated : 28/09/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందంటే? 

దిల్లీ: కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో ప్రజల చూపంతా వ్యాక్సిన్‌ పైనే ఉంది. టీకా ఎప్పుడు వస్తుందోనని అంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ టీకా అభివృద్ధి కోసం వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.  దేశంలో మూడు టీకాలకు సంబంధించి పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. దిల్లీలోని ఐసీఎంఆర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యాక్సిన్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.

ఈ పోర్టల్‌లో కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌ వందేళ్ల టైమ్‌ లైన్‌ను విడుదల చేయడం గర్వంగా ఉందని చెప్పారు. భావితరాల శాస్త్రవేత్తలకు ఐసీఎంఆర్‌ ప్రేరణగా నిలుస్తుందని మంత్రి కొనియాడారు.  దేశంలో మొత్తం మూడు టీకాలకు సంబంధించి ప్రయోగ పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయని, వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో ఎప్పుడైనా టీకా అందుబాటులోకి వస్తుందన్న విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుంటే.. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌, వ్యాప్తి ఉద్ధృతి క్రమంగా తగ్గుతుందని చెప్పారు. ఏదో ఒక రోజు కరోనాపై తప్పక విజయం సాధిస్తామన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని