close
Published : 21/02/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తొలి హాకీ చిత్రం.. వచ్చేస్తుంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న తొలి తెలుగు చిత్రం ‘ఏ వన్‌ ఎక్స్‌ప్రెస్‌’. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డెన్నీస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 5న విడుదల చేస్తున్నామని వెల్లడించింది. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు. హాకీ క్రీడాకారుడి పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన శిక్షణ తీసుకున్నారు సందీప్‌. ఈ సినిమా కోసం ఆయన సిక్స్‌ ప్యాక్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ‘సింగిల్‌ కింగులం’ అనే పాట సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రంతోపాటు ‘రౌడీ బేబీ’లోనూ నటిస్తున్నారు సందీప్‌. మరోవైపు ‘వివాహ భోజనంబు’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు‌. కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటించింది లావణ్య. 

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని