అభిషేక్‌ ‘బిగ్‌బుల్’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌! - abhishek bachchan big bull movie lyrical song out
close
Published : 25/03/2021 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిషేక్‌ ‘బిగ్‌బుల్’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌!

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘బిగ్‌బుల్‌’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా సినిమా నిర్మించిననట్టు బాలీవుడ్‌ టాక్‌. ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఆ చిత్రంలోని ‘ఇష్క్‌ నమాజా’అంటూ సాగుతున్న ఫీల్‌గుడ్‌ రొమాంటిక్ గీతాన్ని విడుదల చేశారు. కున్వార్‌ జునేజా సాహిత్యమందించగా, అంకిత్‌ తివారి ఆలపించారు. గౌరవ్‌దాస్‌ గుప్తా స్వరాలు సమకూర్చారు. నిఖితా దత్తా అభిషేక్‌ భార్యగా నటిస్తుండగా, ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ పాత్రలో ఇలియానా నటిస్తోంది. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆనంద్‌ పండిత్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోకి గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని