MAA Election: అధ్యక్ష బరిలో మరో నటుడు - actor cvl narasimha rao participate in maa elections
close
Updated : 28/06/2021 07:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Election: అధ్యక్ష బరిలో మరో నటుడు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇప్పటికే నలుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడి పేరు వచ్చి చేరింది. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు సీవీఎల్‌ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను అన్నివిధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, నటుడు మంచు విష్ణు, నటీమణులు జీవిత, హేమలు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ప్యానల్‌ సభ్యుల్ని సిద్ధం చేసుకుంటున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని