close
Published : 20/04/2021 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రుద్ర’: అజయ్‌ దేవగణ్‌ ఓటీటీ ఎంట్రీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓటీటీ ఎంట్రీ ఖరారైంది. అజయ్‌ ప్రధాన పాత్రలో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌, బీబీసీ స్టూడియోస్‌ సంస్థలు ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే సిరీస్‌ని రూపొందిస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో పోలీసు పాత్రల్ని పోషించిన అజయ్‌ దేవగణ్‌ ఈ సిరీస్‌లో మరో శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది ఈ సిరీస్‌. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ వేదికగా విడుదలకానుంది’ అని పేర్కొన్నాయి. బ్రిటీష్‌ వెబ్‌ సిరీస్‌ ‘లూథర్‌’ ఆధారంగా తెరకెక్కుతోంది ‘రుద్ర’. రాజేశ్‌ మపుస్కర్‌ దర్శకుడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అజయ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


1384375133201076229

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని