పవన్ సినిమాలో అకీరా లేడు
క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
హైదరాబాద్: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘వకీల్‌సాబ్’లో అకీరా నందన్ నటించలేదని దర్శకుడు వేణుశ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. ‘వకీల్‌సాబ్’ ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వేణు పాల్గొని చిత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలు పంచుకున్నారు. అలాగే పవన్‌తో కలిసి పనిచేయడంలో ఉన్న ఆనందాన్ని బయటపెట్టారు. ‘సినిమా అంటే చిన్నప్పటి నుంచి తెలియని అభిమానం. సినిమాలు చూస్తూ జీవితాన్ని గడపమన్నా ఓకే అంటాను. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ సినిమా నుంచే ఆయనకి నేను ఒక అభిమానిగా మారాను. ‘తొలిప్రేమ’ విడుదలైన సమయంలో ఓకే రోజు వరుసగా నాలుగు షోలు అదే సినిమా చూసి. ఆయనంటే అంత ఇష్టం. అలాంటి ఆయన చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించడం.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’ అని వేణు శ్రీరామ్ తెలిపారు.
అనంతరం ‘వకీల్‌సాబ్’ సర్ప్రైజ్ గురించి నెట్టింట్లో జరుగుతోన్న చర్చపై ఆయన స్పందించారు. ‘ఇటీవల తమన్, రామజోగయ్యశాస్త్రి, నేనూ కలిసి ‘వకీల్‌సాబ్’ ప్రమోషన్లో పాల్గొన్నాం. సెకండాఫ్‌లో ఓ సర్ప్రైజ్ ఉందని తమన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో అందరూ.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్‌చరణ్ అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా అకీరా సైతం ఈ సినిమాలో నటించారని అందరూ చెప్పుకుంటున్నారు. అందుంలో ఎటువంటి నిజం లేదు. ‘వకీల్‌సాబ్’లో ఎలాంటి స్పెషల్ అప్పియరెన్స్‌లు లేవు’ అని ఆయన వివరించారు.
బాలీవుడ్లో తెరకెక్కి.. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ‘పింక్’కు రీమేక్‌గా ‘వకీల్‌సాబ్’ వస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా వస్తోన్న చిత్రమిది. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా థామస్, అనన్య, అంజలి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ముఖ్యభూమిక పోషించారు. ఏప్రిల్ 9న ‘వకీల్‌సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
గుసగుసలు
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..