ఈ ‘సిత్ర’మేదో కొత్తగా ఉంది! - alanti sitralu trailer release
close
Published : 24/03/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ‘సిత్ర’మేదో కొత్తగా ఉంది!

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలే కాకుండా అప్పుడప్పుడూ కథనే నమ్ముకుని వచ్చే చిత్రాలు తళుకున్న మెరుస్తుంటాయి. ఫలితం ఎలా వచ్చిన కొత్తవాళ్లకు ఒక మంచి ప్రయత్నం మిగిలిపోతుంది. అదే కోవలోనే ‘అలాంటి సిత్రాలు’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఆ చిత్ర ట్రైలర్‌ను ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల  విడుదల చేశారు. చివర్లో ‘పరిస్థితులు పరీక్షించినపుడు మనం బతకడానికి ఏ పని చేసినా తప్పులేదు..’అంటూ సాగుతున్న డైలాగ్‌ కథలోని గాఢతను తెలియజేస్తుంది. సుప్రీత్‌ సి కృష్ణ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. ఐ అండ్‌ఐ ఆర్ట్స్‌ పతాకంపై రవీంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. శ్వేత పరాషార్‌, ప్రవీణ్‌ యండమూరి, యష్‌ పూరి, తన్వీ ఆకాంక్ష, అజయ్‌ కతువార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతు ఓంకార్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఆ సిత్రాలేంటో థియేటర్లో చూసేముందు ట్రైలర్‌ చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని