ఆయన షేక్‌ హ్యాండ్‌ ఇస్తే షాక్‌ కొట్టింది: విజయ్‌ - alitho saradga latest promo singer vijay prakash and his wife Mahathi
close
Published : 08/07/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన షేక్‌ హ్యాండ్‌ ఇస్తే షాక్‌ కొట్టింది: విజయ్‌

ఇంటర్నెట్ డెస్క్: ‘కన్నడ, తమిళ, తెలుగు, మరాఠీ భాషల్లో భక్తి, సినిమాకి సంబంధించి సుమారు 5 వేల పాటలు పాడాను’ అని తెలిపారు ప్రముఖ గాయకుడు విజయ్‌ ప్రకాశ్‌. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని ‘వీడు ఆరడుగుల బుల్లెట్టు’ పాటని ఆలపించి, తెలుగునాట మంచి క్రేజ్‌ తెచ్చుకున్న విజయ్‌ సతీసమేతంగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై వినోదం పంచుతోంది. ‘స్వాగతం విజయ్‌ ప్రకాశ్‌ గారు, మహతి గారు.. ఎలా ఉన్నారు?’ అని వ్యాఖ్యాత ఆలీ అడగ్గా ‘బాగానే ఉన్నాం ఇప్పటిదాకా’ అంటూ డబ్బింగ్‌ ఆర్టిస్టు, విజయ్‌ సతీమణి మహతి ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.

విజయ్‌- మహతి ప్రేమ కథ ఎలా మొదలైంది? విజయ్‌కి తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చిన తొలిపాట? రెహమాన్‌తో కలిసి విదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాట పాడితే ఏం జరిగింది? అనే ఆసక్తికర విశేషాలు ఈ ప్రోమోలో చూడొచ్చు. ఈ క్రమంలోనే ఎన్ని పాటలు పాడారు అని ఆలీ అడిగిన ప్రశ్నకి ‘అన్నీ కలిపి 5 వేలు’ అని సమాధానం ఇచ్చారు విజయ్‌. దివంగత గాయకుడు బాల సుబ్రహ్మణ్యాన్ని ఈ వేదికపై గుర్తు చేసుకున్నారాయన. ‘ఓం శివోహం’ అనే గీతాన్ని ఆలపించి మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో అనుబంధం గురించి మాట్లాడుతూ ఒకసారి ఆయన షేక్‌ హ్యాండ్‌ ఇస్తే షాక్‌ కొట్టినట్లు అయ్యింది అని చెప్పారు విజయ్‌ ప్రకాశ్‌.  మరి విజయ్‌- మహతి పంచుకున్న మరిన్ని సంగతులు చూడాలంటే జులై 12 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని