‘ఏఏ 21’.. రంగం సిద్ధమవుతోంది! - allu arjun koratala combo starts soon
close
Published : 21/02/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏఏ 21’.. రంగం సిద్ధమవుతోంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌- కొరటాల శివ కలయికలో ఓ చిత్రం తెరకెక్కునున్న సంగతి తెలిసిందే.  ‘ఏ ఏ 21’ వర్కింగ్‌ టైటిల్‌తో గతేడాది ప్రకటించారు. గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థ సహకారంతో యువసుధ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని తాజా సమాచారం.

ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు బన్ని. ఆగస్టు 13న విడుదలకానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే కొరటాల చిత్రం సెట్‌లో అడుగుపెట్టనున్నారట. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. కాజల్‌ నాయిక. రామ్‌ చరణ్‌ సిద్ధ అనే పాత్రలో మెరవనున్నారు. దేవదాయ శాఖ నేపథ్యంలో రాబోతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని