allu arjun: పుష్ప... ఈ నెలాఖరు నుంచే - allu arjun pushpa shoot resumes from this month onwards
close
Published : 14/06/2021 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

allu arjun: పుష్ప... ఈ నెలాఖరు నుంచే

తగ్గేదే ల్యా... అనే సంభాషణ తరహాలోనే చిత్రీకరణలోనూ జోరు చూపిస్తోంది ‘పుష్ప’ బృందం. కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలోనూ ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడం...లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ నెలాఖరు నుంచే హైదరాబాద్‌లో చిత్రీకరణ షురూ చేయనున్నారు.  కథానాయకుడు అల్లు అర్జున్‌, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం దాదాపు తుదిదశకు చేరుకుంది. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని