ఏపీ: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు - ap corona update
close
Updated : 17/08/2020 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో (9am-9am) రాష్ట్రవ్యాప్తంగా 6,780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 29.05లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,777 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అవ్వగా.. కొవిడ్‌తో తాజాగా 82 మంది మృతి చెందారు. మొత్తంగా 2,732 మంది మరణించారు.

ప్రకాశం జిల్లాలో పదమూడు మంది; తూర్పు గోదావరి జిల్లాలో పది మంది; చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది; గుంటూరు, కడప జిల్లాల్లో ఏడుగురు; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు; అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో ముగ్గురు; నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలివీ.. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని