తెలంగాణతో గొడవపడాలని ఎప్పుడూ అనుకోలేదు: బొత్స - ap minister botsa satyanarayana press meet
close
Published : 03/08/2021 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణతో గొడవపడాలని ఎప్పుడూ అనుకోలేదు: బొత్స

అమరావతి: తెలంగాణతో గొడవపడాలని ఎప్పుడూ అనుకోలేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం త్వరగా సమసిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రానికి దుర్మార్గ వైఖరి అని ధ్వజమెత్తారు. రాజధాని చట్టం ఆమోదించిన రోజు నుంచే 3 రాజధానులు అమల్లోకి వచ్చాయని తెలిపారు. తెదేపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే అమరరాజా  పరిశ్రమ తరలిపోయిందనేది  అవాస్తవమన్నారు. ఆదాయం కోసమే పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు అమరరాజా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని