Corona: వుహాన్‌లో మళ్లీ కరోనా కలవరం.. నగరవాసులందరికీ పరీక్షలు - authorities in wuhan said they would test its entire population for covid19
close
Published : 03/08/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: వుహాన్‌లో మళ్లీ కరోనా కలవరం.. నగరవాసులందరికీ పరీక్షలు

వుహాన్: కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరంలో స్థానికంగా వైరస్ కేసులు నమోదుకావడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. దాంతో ఆ నగరంలోని 1.1 కోట్ల జనాభాకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

కరోనా మొదట వెలుగులోకి వచ్చిన వుహాన్‌ నగరంలో 2020 ప్రారంభంలో కఠిన ఆంక్షలు అమలయ్యాయి. కట్టుదిట్టమైన చర్యలతో అక్కడ వైరస్‌ అదుపులోకి వచ్చింది. మళ్లీ ఏడాదిన్నర తర్వాత స్థానికంగా ఏడు కేసులు బయటపడ్డాయి. వలస కార్మికుల్లో ఆ కేసుల్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. తాజాగా దేశీయంగా 61 మందికి కరోనా సోకింది.

చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో పలు నగరాల్లో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. రవాణా సదుపాయాలను కుదించింది. అలాగే భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలను ప్రారంభించింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వేవ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశీయంగా వైరస్‌ కేసుల్ని సున్నాకి తగ్గించినట్లు గతంలో చైనా ప్రకటించుకుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి వీలు కల్పించింది. కానీ, జులై మధ్య నుంచి దేశీయంగా 400 కంటే ఎక్కువ కేసులు నమోదుకావడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు చైనా వ్యాప్తంగా 93,193 కరోనా కేసులు నమోదుకాగా.. 4,636 మరణాలు సంభవించాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని