‘బెల్‌ బాటమ్‌’ చిత్రీకరణ పూర్తి - bell bottom shoot completed
close
Published : 02/10/2020 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బెల్‌ బాటమ్‌’ చిత్రీకరణ పూర్తి

ముంబయి: అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బెల్‌బాటమ్‌’. కరోనా ప్రభావంతో ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ముందు అనుకున్నట్టుగానే విదేశాల్లో తిరిగి ప్రారంభమైంది. అంతే వేగంగా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

‘‘చిత్రబృందమంతా కలిసికట్టుగా పనిచేసిన తీరే మా సినిమా పూర్తి కావడానికి ప్రధాన కారణం. చిత్రబృందంలోని అందరికీ ధన్యవాదాలు. రెగ్యులర్‌ చిత్రీకరణ పరిస్థితులకు భిన్నంగా పూర్తి చేశాం’’అన్నారు. రంజిత్‌ ఎమ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీకపూర్‌ నాయిక. లారా దత్తా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని