kgf 2: స్పెషల్‌  భామలు వీళ్లేనా?  - bollywood actress for kgf special song
close
Updated : 03/05/2021 10:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

kgf 2: స్పెషల్‌  భామలు వీళ్లేనా? 

ఇంటర్నెట్‌డెస్క్‌: యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌: చాప్టర్‌ 2’. 2018లో వచ్చి, విజయవంతమైన ‘కేజీయఫ్‌: చాప్టర్‌ 1’కి కొనసాగింపు చిత్రమిది. కోలార్‌ బంగారు గనులు నేపథ్యంగా సాగే హైఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇందులో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిందులో ఓ ప్రత్యేక గీతం కోసం మరో ఇద్దరు భామల్ని రంగంలోకి దింపుతున్నటు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్‌ నాయికలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లను పరిశీలిస్తున్నారు. 

‘కేజీయఫ్‌‌’ తొలి భాగంలోనూ ఓ ప్రత్యేక గీతముంది. ఆ పాటకు దక్షిణాది భాషల్లో తమన్నా కాలు కదపగా.. హిందీలో మౌనీ రాయ్‌తో తెరకెక్కించారు. ఇప్పుడీ రెండో భాగం కోసం ఇదే పంథాలో ఇద్దరు భామల్ని రంగంలోకి దించాలా? లేక ఒకరితోనే చేయించాలా? అని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఒకరితోనే ఆ పాట తెరకెక్కించే ప్రయత్నం చేస్తే.. జాక్వెలిన్, నోరాల్లో ఒకరినే తీసుకునే అవకాశముంది. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని