ముంబయి: చీర కడితే ఒయ్యారంగా నడవాలి. ఎప్పటికప్పుడు సవరించుకుంటూ జాగ్రత్త పడాలి. కానీ హరియాణా అమ్మాయి పరుల్ అరోరా ఉంది చూశారూ! చీరతోనే అమాంతం గాల్లో పల్టీలు కొడుతుంది. విన్యాసాలతో కళ్లార్పకుండా చేస్తుంది. ఈ సాహసాలతోనే తనిప్పుడు ఆన్లైన్ సంచలనంగా మారింది. పరుల్ ఓ జిమ్నాస్ట్. సాధారణంగా జిమ్నాస్ట్‌లు ట్రాక్‌లోకి దిగేముందు సౌకర్యంగా ఉండేందుకు ఒంటికి అతుక్కుపోయే ట్రాక్ దుస్తులు ధరిస్తారు. కానీ దీనికి భిన్నంగా.. నిపుణుల మాటల్లో చెప్పాలంటే పరుల్ ప్రమాదకర విన్యాసాలు చేస్తోంది. అలాగని తను ఆషామాషీ అమ్మాయేం కాదు. జాతీయస్థాయిలో పదుల సంఖ్యలో బంగారు పతకాలు గెల్చుకున్న జిమ్నాస్ట్. ప్రస్తుతం చీర కట్టి.. ఫ్రంట్ ప్లిప్, బ్యాక్‌ఫ్లిప్, కార్ట్‌వీల్స్ విన్యాసాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
‘చీరతో ప్రమాదకరమైన విన్యాసాలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్‌లో ఉంటోంది. ‘మగువకి మరింత అందం తెచ్చే చీర అంటే నాకెంతో ఇష్టం. అలాగే నాకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన జిమ్నాస్టిక్స్ అన్నా. ఈ రెండింటిపై మమకారం చాటుకోవడానికే ఇలా చేస్తోన్నా’ అంటోంది తను. ఈ వీడియో, ఫొటోల్ని లక్షలమంది వీక్షించారు. చీరకట్టులో పరుల్ చేస్తున్న విన్యాసాల పట్ల బాలీవుడ్ నటీమణులు విద్యాబాలన్, రవీనా టాండన్ సైతం మనసు పారేసుకున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇదీ చదవండి
ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘రంగ్ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు
- ‘పీఎస్పీకే 27’.. ఫస్ట్‌లుక్, టైటిల్ ఆరోజే
- ఆకట్టుకుంటోన్న ‘శ్యామ్‌సింగ్‌రాయ్’ ఫస్ట్‌లుక్!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
- ఒకే రోజు రెండు పెద్ద సినిమాల విడుదల!
గుసగుసలు
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్ సెల్వన్..!
- శంకర్-చరణ్ మూవీ: ఆ షరతులు పెట్టారా?
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి!
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘నాలో ఆర్ట్‌ని గుర్తించింది పవన్ కల్యాణే’
- నా నటనతో... ఆ పేరు మార్చేసుకుంటా!
కొత్త పాట గురూ
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ
-
‘చెక్’మేట్‌తో ఒక డ్యూయెట్!
-
ఫిఫిఫీ..ఫిఫీ..అంటున్న గాలిసంపత్!