ఆ ఇద్దరిలో ఎవరితో? - boyapati srinu next team up with allu arjun or ravi teja
close
Published : 25/05/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఇద్దరిలో ఎవరితో?

ర్శకుడు బోయపాటి శ్రీను తర్వాతి చిత్రంపై చిత్రసీమలో ఆసక్తికర చర్చ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత ఆయన చేయనున్న ప్రాజెక్ట్‌ ఎవరితో ఉంటుందన్నది ఇంత వరకు తేలలేదు. అయితే ప్రస్తుతం చిత్రసీమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆయన తన తర్వాతి చిత్రం కోసం కథానాయకులు రవితేజ, అల్లు అర్జున్‌లను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఆయన ఇప్పటికే ఈ ఇద్దరికీ కథలు వినిపించారని.. స్క్రిప్ట్‌లు నచ్చడంతో వారూ ఆయనతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం వినిపిస్తోంది. అయితే వీరిద్దరిలో ముందు ఏ హీరో నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందన్నది తేలాల్సి ఉంది. బోయపాటి గతంలో రవితేజతో ‘భద్ర’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ లాంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ ఇద్దరిలో ఎవరి చిత్రం ఖరారైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికైతే రవితేజ.. నక్కిన త్రినాథరావు కొత్త సినిమాతో, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని