close
Published : 03/03/2021 23:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా  

హైదరాబాద్‌: శర్వానంద్‌ కథానాయకుడుగా బి.కిశోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్‌ నాయిక. వ్యవసాయమే ప్రధాన కథాంశంగా రూపొందుతున్న ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి చిత్ర మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా మంచి సినిమా. హీరో శర్వానంద్‌తో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తానే సమయంలో 14 రీల్స్ సంస్థ నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పుడే దర్శకుడు కిశోర్‌ ఈ కథ ఉందని చెప్పారు. గతంలో రైతులపై చాలా సినిమాలు వచ్చేవి. అలాంటి సినిమాలు మళ్లీ రావాలి. మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’.. శర్వానంద్‌ నటిస్తున్న ‘శ్రీకారం’ చిత్రాల కథలు వేర్వేరు. కానీ రెండూ రైతుల గురించే మాట్లడతాయి.

చిత్రంలో శర్వానంద్‌ రైతుల గురించి చాలా బాగా చెప్పారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. రచయిత మాటలు రాసేటప్పుడు హీరోను, కథను రెండింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ప్రేక్షకుడూ ఆశించే అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. రైతులకు అన్యాయం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ దాని గురించి  మాట్లాడాలి. అప్పుడే కొంతైనా వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడంతా దేశంలో రైతుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో  ‘శ్రీకారం’ సినిమా రావడం మంచిదే. మతం, కులం ఏదైనా సరే మన తాత ముత్తాలంతా రైతులే. మనమంతా రైతులమే. ప్రతి మనిషిలోనూ రైతు ఉంటాడు. అది ఈ సినిమా చూస్తే మీకే అర్థమౌతుంది. చిత్రసీమలోకి నేను మాటల రచయిత అవుదామనే వచ్చా. అలానే అయ్యా. అందరి దర్శకుల దగ్గర పనిచేయాలని అనుకుంటున్నా. సినిమా చేసేటప్పుడు దర్శకుడికి రచయితకి మధ్య చిన్నచిన్న తగాదాలు వస్తుంటాయి. అదంతా సినిమా కోసమే. ‘శ్రీకారం’ అందరినీ మెప్పిస్తుంది. ‘ఆర్‌.ఆర్.‌ఆర్‌’ చిత్రంపై ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోవచ్చు.. వాటిని కచ్చితంగా అందుకుంటుంది’’ అని సాయి మాధవ్‌ అన్నారు. 14రీల్స్ ప్లస్‌ పతాకంపై  రూపొందుతున్న సినిమాకి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. ఆమని, నరేష్‌, రావు రమేశ్‌, సాయి కుమార్‌, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు నటించారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని