ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌ - celebrity tweets to vakeelsaab
close
Published : 10/04/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌

‘వకీల్‌సాబ్‌’పై సినీ ప్రముఖులు ప్రశంసలు

హైదరాబాద్‌: దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో హిట్‌ అందుకున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. ఇప్పటికే సినిమా చూసిన పవన్‌ అభిమానులు.. సినిమా సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సైతం ‘వకీల్‌సాబ్‌’ గురించి తమ రివ్యూ బయటపెట్టారు.

‘‘వకీల్‌సాబ్‌ జడ్జిమెంట్‌.. పవర్‌ఫుల్‌ బ్లాక్‌బస్టర్. పవన్‌కల్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షో. వేణుశ్రీరామ్‌ డైలాగ్స్‌, డైరెక్షన్‌ బాగుంది. తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, అలాగే పాటలు ఆకట్టుకున్నాయి. నిర్మాత దిల్‌రాజు, ఇతర చిత్రబృందం మొత్తానికి అభినందనలు’’ - అనిల్‌ రావిపూడి

‘జాతర షురూ ....’ - హరీశ్‌ శంకర్‌

‘మాస్‌ కా బాప్‌ వకీల్‌సాబ్‌. మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. ఓన్లీ జడ్జిమెంట్‌ బ్లాక్‌బస్టర్‌! జై పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌’ - బండ్ల గణేష్‌

‘‘పవర్‌స్టార్‌ మీ ఆవేశం, ఆశయం గొప్పవి. ఇప్పుడు జనాలకి మీరు కావాలి. స్టైల్‌కి కింగ్‌.. మునుపెన్నడూ లేనివిధంగా ప్రేక్షకులను అలరించేందుకు కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. పవన్‌ నటన, డైలాగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి. వేణుశ్రీరామ్‌ డైరెక్షన్‌ బాగుంది’ - మెహర్‌ రమేష్‌

‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షో వకీల్‌సాబ్‌!! పవన్‌కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌ల మధ్య జరిగే కోర్టు రూమ్‌ డ్రామా సూపర్‌గా ఉంది. తమన్‌ మ్యూజిక్‌ బాగుంది. టీమ్‌ మొత్తానికి కంగ్రాట్స్‌’ - రామ్‌ ఆచంట (నిర్మాత)

‘వకీల్‌సాబ్‌ బ్లాక్‌బస్టర్‌.  పవర్‌స్టార్‌ ఆన్‌ ఫైర్‌. చిత్రబృందానికి నా అభినందనలు’ - నితిన్‌

‘మంచి టీమ్‌, ఆలోచింపచేసే కథనం, అద్భుతమైన నటనతో వకీల్‌సాబ్‌ తెరకెక్కింది. ఇలాంటి గొప్ప కథను ఓకే చేసిన పవన్‌కల్యాణ్‌కు నా అభినందనలు. ఆయన నటన సూపర్‌గా ఉంది. దిల్‌రాజు, వేణుశ్రీరామ్‌ కంగ్రాట్స్‌’ - క్రిష్‌

‘ఒక్కటే మాట బ్లాక్‌బస్టర్‌’ - నిఖిల్‌

‘కోర్టు రూమ్‌.. ముఖ్యంగా తీర్పుకు ముందు సన్నివేశాల్లో పవన్‌కల్యాణ్‌ని చూస్తే ఒళ్లు గగుర్పొడిచింది. సెకండాఫ్‌లో అందరి ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. బాక్సాఫీస్‌ వద్ద వకీల్‌సాబ్‌ భారీ వసూళ్లను రాబట్టాలని ఆశిస్తున్నా! దిల్‌రాజుతోపాటు ఇతర చిత్రబృందానికి కంగ్రాట్స్‌!’ - దేవ్‌కట్ట
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని