వారికిది గొప్ప అవకాశమే: మోర్గాన్‌ - chance for fringe players to push their case morgan
close
Published : 23/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారికిది గొప్ప అవకాశమే: మోర్గాన్‌

పుణె: టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యేందుకు ఆటగాళ్లకు టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌ మంచి అవకాశమని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. టీ20 క్రికెట్‌, 50 ఓవర్ల ఫార్మాట్లో పరిస్థితులు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాతో మూడో వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘టీ20 ప్రపంచకప్‌ ముందర్లో ఉంది. ఇప్పటి వరకు తుది జట్టులోకి ఎంపికవ్వని వాళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం గొప్ప అవకాశం. విదేశాల్లో పరుగులు చేసి వికెట్లు తీస్తే వాళ్లు టీ20 జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఒకే వేదికలో పటిష్ఠమైన జట్టుతో తలపడటం ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు 50 ఓవర్ల వైఖరికి అలవాటు పడటం ముఖ్యం. వన్డే, టీ20 క్రికెట్‌ పరిస్థితులు ఒకేలా ఉంటాయి. జట్లలోనూ పెద్దగా మార్పులుండవు. రెండు జట్ల నైపుణ్యాలు ఒకేలా ఉంటాయి’ అని మోర్గాన్‌ అన్నాడు.

‘ఇక్కడి పరిస్థితులు మాకు కొత్తే. భారత్‌ వంటి దేశాల్లో ఆడేటప్పుడు సౌకర్యవంతమైన జోన్‌ నుంచి బయటపడొచ్చు. పొరపాట్లు చేసి నేర్చుకోవచ్చు. టీ20 సిరీసు గెలవకపోయినా ఫర్వాలేదు. ఇప్పటి వరకు మా పర్యటన బాగా సాగింది. ఎందుకంటే మా లక్ష్యం ప్రపంచకప్‌. మెగాటోర్నీ గెలవాలంటే వరుసగా ప్రతి సిరీసూ గెలవాల్సిన అవసరం లేదు. పరిస్థితుల వల్లే మొయిన్‌ అలీకి చోటు దక్కలేదు. మేం ఆడిన పిచ్‌లపై ఫింగర్‌ స్పిన్నర్లకు అనుకూలత లేదు. ఏదేమైనా ఆల్‌రౌండర్లు ఉండటం జట్టుకు గొప్ప విలువ. వన్డేల్లో రూట్‌ లేకపోవడం మాత్రం కాస్త ఇబ్బంది కరమే’ అని మోర్గాన్‌ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని