రాయ్‌పూర్‌లో 10రోజులు పూర్తి లాక్‌డౌన్‌! - chhattisgarh govt imposes lockdown in raipur from april 9
close
Published : 07/04/2021 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాయ్‌పూర్‌లో 10రోజులు పూర్తి లాక్‌డౌన్‌!

రాయ్‌పూర్‌: దేశంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో దేశం మళ్లీ క్రమంగా ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. వైరస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు వస్తుండటంతో ఇప్పటికే పలు ఆంక్షలు అమలుచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని నగరం రాయ్‌పూర్‌లో 10 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 9 నుంచి 19వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఒక్క రాయ్‌పూర్‌లోనే  ప్రస్తుతం 13,107 క్రియాశీల కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు, మరణాలు పెరగడంపై ఆందోళన వ్యక్తంచేసిన సీఎం భూపేశ్‌ బఘెల్‌ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో పడకల లభ్యతపై వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. అనవసరంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

నిన్న మహారాష్ట్రలో 55వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో  అత్యధికంగా 9921 కేసులు, 53 మరణాలు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యంగా దుర్గ్‌, రాయ్‌పూర్‌, రాజ్‌నంద్‌గావ్‌, బిలాస్‌పూర్‌, మహాసముండ్‌లలో భారీగా కేసులు నమోదవుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 3,86,269 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,29,408మందికోలుకోగా.. 4416మంది మరణించారు. ప్రస్తుతం 52,445 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని