TTD అన్నదానానికి రూ.కోటి విరాళమిచ్చిన నిర్మాత - cinema producer anandaprasad donated one crore rupees to ttd
close
Published : 07/07/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TTD అన్నదానానికి రూ.కోటి విరాళమిచ్చిన నిర్మాత

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణకు ‘భవ్య’ సంస్థల అధినేత, ప్రముఖ సినీ నిర్మాత వి.ఆనందప్రసాద్ రూ.కోటి విరాళంగా అందజేశారు. తిరుమలలో అదనపు ఈవో ధర్మారెడ్డిని బుధవారం కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు విరాళానికి సంబంధించిన చెక్కు అందజేశారు. ‘తితిదే’కు గతంలోనూ ఆనందప్రసాద్ రూ.కోటి విరాళం ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్టుకు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. అంతేకాదు.. ఆనందప్రసాద్ కుటుంబం హైదరాబాద్‌లోని భవ్య భవన సముదాయ ప్రాంగణాల్లో ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దేవాలయాలు కూడా నిర్మించారు. తెలుగులో శౌర్యం, సౌఖ్యం, పైసా వసూల్‌, చెక్‌ వంటి పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని