రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా పాజిటివ్‌ - corona positive report for rajashekar family
close
Updated : 17/10/2020 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా పాజిటివ్‌

ట్విటర్‌లో ప్రకటించిన నటుడు

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రాజశేఖర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని ఆయన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ‘నాకు, జీవితకు, మా ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందన్న వార్తలు నిజమే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. ఇద్దరు కుమార్తెలు పూర్తిగా కోలుకున్నారు. నేను, జీవిత కాస్త అనారోగ్యంతో ఉన్నాం. త్వరలోనే ఇంటికి చేరుకుంటాం... ధన్యవాదాలు’ అని రాజశేఖర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఫాలోవర్స్‌ వరుస కామెంట్లు చేశారు. ‘త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం..’ అని పేర్కొన్నారు.

‘గరుడవేగ’ సినిమా నుంచి రాజశేఖర్‌ బిజీగా ఉన్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ‘అర్జున్‌’ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన మరియం జకారియా నటించారు. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టి కరుణ, నట్టి క్రాంతి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని