Google:భారత్‌కు 113 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్ - covid 19 relief google announces another 15.5 million grants to help rural india fight pandemic
close
Updated : 17/06/2021 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Google:భారత్‌కు 113 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

80 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలకు నైపుణ్య శిక్షణ

దిల్లీ: ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌కు రూ. 113 కోట్ల కరోనా సాయాన్ని అందించనుంది. ఈ మేరకు గురువారం గూగుల్‌ ఒక సమావేశంలో తెలిపింది. భారత్‌లో 80 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు వివిధ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా గివ్‌ ఇండియా సంస్థకు 90 కోట్ల రూపాయలు, 18.5 కోట్ల రూపాయలను పాత్‌ సంస్థకు అందించనుంది. అంతేకాకుండా కొవిడ్‌ 19 కోసం గ్రామీణ ప్రాంతాల్లోని 20వేల మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్న అపోలో మెడ్‌స్కిల్స్‌కు ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్మాన్‌ సంస్థకు 3.6 కోట్లను మంజూరు చేయనుంది.

‘‘ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మా బాధ్యత. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి భారత్‌ నెమ్మదిగా బయటపడుతోంది. దీని కోసం ప్రభుత్వాలు, సంస్థలు, సంఘాలు కలిసి పనిచేయడం స్ఫూర్తిదాయకం. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి గూగుల్ సహకరిస్తుంది. గూగుల్ అందించిన రెండు గ్రాంట్లతో కరోనా సంక్షోభంలో తీవ్రంగా భారత్‌ పుంజుకుంటుందని ఆశిస్తున్నాం ’’ అని గూగుల్ ఇండియా హెడ్‌ సంజయ్‌ గుప్తా విలేకరులతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో అన్నారు. గత ఐదేళ్లలో గూగుల్ భారత్‌కు 57 మిలియన్‌ డాలర్ల విలువైన సాయం అందించిందని ఆయన పేర్కొన్నారు.

గివ్‌ ఇండియా సంస్థ సీఈవో అతుల్‌ సతిజా మాట్లాడుతూ... పాత్‌ సంస్థతో కలిసి ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని కోసం పాత్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తుందన్నారు. మూడు నుంచి ఆరు నెలల్లోపు ఆక్సిజన్‌ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్‌ అవసరాలతో పాటు భవిష్యత్తులో  ఉపయోగపడేలా ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని పాత్‌ సంస్థ డైరక్టర్‌ నీరజ్‌ జైన్‌ తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని