12 రోజుల్లోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు! - covid positivity rate doubles to 16 percent in 12 days govt
close
Published : 18/04/2021 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12 రోజుల్లోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు!

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: కరోనా రెండో దఫా విజృంభణతో పాజిటివ్‌ కేసుల సంఖ్య విస్తృత వేగంతో పెరిగిపోతున్నాయి. దీంతో రోజువారీగా బయటపడుతోన్న కరోనా పాజిటివ్‌ రేటు గణనీయంగా పెరిగింది. కేవలం 12రోజుల్లోనే ఇది రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌ 6 తేదీన 8శాతంగా ఉన్న కొవిడ్‌ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.69శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 12రోజుల్లోనే రెట్టింపు అయినట్లు పేర్కొంది. ఇక గత నెలలో 3.05శాతం ఉన్న పాజిటివిటీ రేటు, ప్రస్తుతం 13.54శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వారపు పాజిటివిటీ రేటు అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 30.38 శాతం నమోదుకాగా, గోవా(24.24%), మహారాష్ట్ర(24.17%), రాజస్థాన్‌(23.33%), మధ్యప్రదేశ్‌(18.99%) రాష్ట్రాల్లో అధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక దిల్లీలోనూ గడిచిన 24గంటల్లో కరోనా కేసుల సంఖ్య 25వేలు నమోదయ్యాయి. దీంతో అక్కడి పాజిటివిటీ రేటు 30శాతానికి చేరుకుంది.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2.61లక్షల పాజిటివ్‌ కేసులు, 1501 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 18లక్షలకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు ఎక్కువగా పది రాష్ట్రాల్లోనే ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 78.56శాతం కేసులు కేవలం ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని