‘సర్కస్‌’లో దీపిక స్టెప్పులు - deepika padukone in cirkus
close
Updated : 17/03/2021 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సర్కస్‌’లో దీపిక స్టెప్పులు

ముంబయి: రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొణె జంట తెరపైనా, బయటా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ జంట తెరపై కనిపించిన ప్రతిసారి అభిమానులకు పండగే. ఈ ఇద్దరు పలు చిత్రాల్లో జంటగా నటించి అలరించారు. రణ్‌వీర్‌ తాజా చిత్రం ‘83’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది దీపిక. ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై అలరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ నటిస్తున్న చిత్రం ‘సర్కస్‌’. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో దీపిక ఆడిపాడనుందట. ఇప్పటికే దీపికకు సంబంధించిన గీతాన్ని పూర్తి చేసినట్టు బాలీవుడ్‌ సమాచారం. తను నటించే ప్రతిష్టాత్మక చిత్రంలోనూ దీపిక ఉండటం శుభసూచికంగా భావిస్తాడట రణ్‌వీర్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని