ఆర్జీవీ- రాజశేఖర్‌ల ‘దెయ్యం’ కథేంటి? - deyyam trailer
close
Published : 09/04/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్జీవీ- రాజశేఖర్‌ల ‘దెయ్యం’ కథేంటి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో జె.డి.చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ ప్రధాన పాత్రల్లో ‘దెయ్యం’ అనే హారర్‌ చిత్రం తెరకెక్కించి ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అదే పేరుతో రాజశేఖర్‌, స్వాతి దీక్షిత్‌ ప్రధాన తారాగణంగా మరో సినిమా రూపొందించారాయన. ఈ చిత్రం ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదల చేశారు. అందులో ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచుతూ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది‌. ‘దెయ్యం పట్టిందంటే.. జత కట్టిందంటే.. అంతే’ అంటూ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో స్వాతి దీక్షిత్‌, తండ్రి పాత్రలో రాజశేఖర్‌ నటన మెప్పిస్తుంది. మరి ఈ దెయ్యం కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తనికెళ్ల భరణి, జీవా, బెనర్జీ తదితరులు నటించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: డీఎస్‌ఆర్‌, ఛాయాగ్రహణం: సతీశ్‌ ముత్యాల, కూర్పు: సత్య, అన్వర్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని